మాజీ మేయర్ పారిజాత జన్మదిన వేడుకలు
03-08-2026 12:00 AM
బడంగ్ పేట్, అగస్టు 2 (విజయక్రాంతి): బడంగ్పేట్ మాజీ మేయర్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం బాలాపూర్లో ఘనంగా జరిగాయి.బాలాపూర్ సర్పంచ్గా రాజకీయాల్లోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పలువురు నాయకులు,అభిమానులుమర్యాదపూర్వంగా వారి నివాసానికి చేరుకొని తమ అభిమాన నేతలను కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. బడంగ్పేట్ మేయర్గా, టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా పారిజాత అందించిన సేవలను నాయకులు కొనియాడారు.ప్రజాక్షేత్రంలో నిరంతరం శ్రమిస్తున్న చిగిరింత దంపతులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని వారు అకాంక్షించారు.






