కాలనీల్లో పర్యటించిన మాజీ మేయర్
ప్రజాసమస్యలను తెలుసుకున్న జక్కా వెంకటరెడ్డి
మేడిపల్లి, మే 31 (విజయక్రాంతి): మ ల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని మేడిపల్లి డివిజన్ వినాయక్ నగర్ కాలనీలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మేయర్ జక్క వెంకట్ రె డ్డి, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకు లు, డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు కాలనీ ప్రజలతో కలిసి విస్తృత స్థాయి ప్రజా పర్యటన నిర్వహించారు. సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ స్థానికుల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారులతో చ ర్చించారు.
కాలనీలలో ప్రధాన స మస్యగా తాగునీటి కొరత ఉందని, పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోయి నెలల తరబడి అలాగే ఉన్నాయని, గల్లీలు, ఖాళీ స్థలాలు, ఇండ్ల మధ్యలో ఉన్న ఖాళీ ప్లాట్లలో చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని, దో మలు, ఈగలు విపరీతంగా పెరిగి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని స్థానికులు వివరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడితే, అధికారులు సానుకూలంగా స్పందించి, మున్సిపల్ అధికారులు చెత్త తొలగింపు కార్యక్రమా న్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మా ట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో నిరంతరం ప్రజల మధ్య ఉంటూ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తామని, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం,గృహ నిర్మాణ పథకాల వంటి అం శాల్లో ప్రజలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి,మాజీ కార్పొ రేటర్లు దొంతిరి హరిశంకర్ రెడ్డి,కొల్తూరి మహేష్,కౌడే పోచయ్య, నాయకులు జావీద్ ఖాన్, ఆకుల మధుకర్ పాల్గొన్నారు.






