శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం మూసివేత
ఎర్రుపాలెం, మార్చి 3 (విజయక్రాంతి): మండల పరిధిలోని జమలాపురం గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సంపూర్ణ చంద్రగ్రహణం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మంగళవారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జమలాపురం ఆలయం యొక్క దర్శన వేళల్లో మార్పులు ఉంటాయని ఆలయ ఈవో కొత్తూరు జగన్ మోహన్ రావు తెలియజేశారు.తేదీ మంగళవారం రోజున ఉదయం 09-00 గంటలకు స్వామివారి ఆలయ ద్వారబంధనం చేసి ఆలయాన్ని మూసివేశారు.
మరుసటి రోజు తేదీ బుధవారం రోజున శుద్ధి, సంప్రోక్షణ చేసి ఉదయం 09-00 గంటల నుండి భక్తులకు శ్రీ స్వామివారి దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు. కావున భక్తులు గమనించి స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ ఈవో పేర్కొన్నారు. చంద్రగ్రహణం కారణంగా మండల లోని పలు ఆలయాలను మూసివేశారు. మండల కేంద్రంలోని శివాలయం కూడా మూసివేశారు. గ్రహణం తర్వాత ఆలయాన్ని సంప్రోక్షణ చేసి భక్తులకు దైవ దర్శనం కల్పిస్తామని అర్చకులు నూరి గోపాలకృష్ణ, ఆలయ చైర్మన్ మగినం జయశ్రీ పేర్కొన్నారు.




