22-07-2025 12:00:00 AM
నకిరేకల్, జూలై 21 : జూలై 23న భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు పర్వతం వేణు స్పెషల్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఎన్‌ఎస్యూఐ కార్యకర్త నుంచి భువనగిరి ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టిన తీరును ఈ పాటలో పొందుపరిచారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ కోసం చేసిన కృషి అద్భుతమని కాంగ్రెస్ నేత పర్వతం వేణు కొనియాడారు. ఎంపీగా ఎక్కడ ఉన్నా.. ఆపద అని తెలిస్తే.. వెంటనే స్పందించే మంచి లీడర్ అంటూ చెప్పుకొచ్చారు.