30 July, 2026 | 11:18 AM

ఉద్వేగానికి గురైన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

30-11-2024 02:27 AM

సూర్యాపేట, నవంబర్ 29: సూర్యాపేటలో శుక్రవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ‘దీక్షా దివస్’లో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీస్‌రెడ్డి ప్రసంగించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నాడు చేపట్టిన ఆమరణ దీక్షతో పాటు పదేళ్ల పాటు ప్రజలకు అందించిన సేవలను గుర్తుచే సుకుంటూ ఆయన ఉద్వేగానికి గురై కంటతడి పెట్టారు.

కోట్ల గొంతులను ఏకం చేసి తెలంగాణను సాధించిన మహానేత కేసీఆర్ అని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రాన్ని యావత్ దేశానికి ఆదర్శంగా నిలిపారన్నారు. కార్యక్రమంలో నల్లగొండ మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిశోర్‌కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, పార్టీ ఒంటెద్దు నర్సింహారెడ్డి, వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ పాల్గొన్నారు.