18-07-2025 12:00:00 AM
మణుగూరు, జులై 17 ( విజయ క్రాంతి) :బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం కరకగూడెం మండలం లో పర్యటించనున్నారు. 12:30 కు హెలికాప్టర్ ద్వారా మండలానికి చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గంద్వారా సమిత్ బట్టుపల్లి లోని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు స్వగృహా న్ని సందర్శిస్తారు. రేగా మాతృ మూర్తి నర్సమ్మ కు నివాళి అర్పించి,కాంతారావును, కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.
అక్కడి నుండి తిరిగి 1.30 హైద రాబాద్ బయలుదేరి వెళ్తారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా బట్టుపల్లి స్టేడియం నందు ఏర్పాటు చేసిన హెలిపాడ్‌ల్యాండింగ్ ప్రదేశాన్ని గురువారం జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు, ఆర్ అండ్ బి డి ఈ సతీష్ ,ఏడుళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు , బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పరిశీలించారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తుఏర్పాటుచేశారు.