18-07-2025 12:00:00 AM
- రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు
- ఆస్పత్రి ఆడిటోరియంలో ‘తలసేమియా’ పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 17(విజయక్రాంతి): తలసేమియా బాధితుల కోసం ‘కామినేని హాస్పిటల్స్’ చేస్తున్న స్వచ్ఛంద ఉచిత సేవా కార్యక్రమాలు అభినందనీయమని రంగారెడ్డి డీఎంహెచ్‌వో డాక్టర్ బలు సు వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కామినేని ఆసుపత్రి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్ర మానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కామినేని హాస్పిటల్స్ వారు రూపొందించిన ‘తలసేమియా’ బాధితుల కోసం ఉచిత వైద్య చికిత్స పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. తల్లి దండ్రుల్లో అవగాహన కల్పించి, పిల్లలకు తలసీమియా సంబంధిత పరీక్షలు చేసేందుకు సామాజిక బాధ్యతతో కామినేని ఆస్ప త్రి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ అవకాశాన్ని తలసేమియా బాధి తులు వినియో గించుకోవాలన్నారు.
కామినేని హాస్పిటల్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.అంజయ్య మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సా యంత్రం 4 గంటల వరకు నిర్వహించే ఈ శిబిరంలో పిల్లల వైద్య నిపుణులు, హెమటాలజిస్టు, జెనెటిక్ వైద్య నిపుణులు పాల్గొని పిల్లలకు పలు పరీక్షలు చేస్తారని చెప్పారు.
ఈ శిబిరంలో పాల్గొని, ఉచితంగా పరీక్షలు చేయిం చుకోవాలనుకునేవారు 89854 50534 అనే నెంబరులో సంప్రదించవచ్చని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు డాక్టర్ పాపారావు, డాక్టరు షిభా, డాక్టర్ పూనమ్, డాక్టర్ రాధిక, జిల్లా ఉప వైద్య అధికారులు డాక్టర్ పూర్ణిమ, డాక్టర్ వీ విజయ లక్ష్మి, డాక్టర్ గీత, డాక్టర్ నాగేంద్ర బాబు, ఆనంద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.