రోడ్డు పనులు వేగవంతం చేయాలని మాజీమంత్రి మల్లారెడ్డికి విజ్ఞప్తి
జవహర్‌నగర్,(విజయక్రాంతి): దమ్మాయిగూడ–నాగారం ప్రధాన రహదారి అభివృద్ధి పనులను ఇకపై ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించాలని కోరుతూ మెయిన్ రోడ్ ప్లాట్స్ అసోసియేషన్ సభ్యులు మాజీ మంత్రి మల్లారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.ప్రస్తుతం ప్రతిపాదించిన 100 అడుగుల రహదారిని 80 అడుగులకు పరిమితం చేసి పనులు చేపడితే ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు తొలగిపోతాయని వారు వివరించారు.
రహదారి పనులు పెండింగ్‌లో ఉండటంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.ప్రజల సమస్యను ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి రహదారి పనులు త్వరగా ప్రారంభించేలా కృషి చేయాలని మల్లారెడ్డిని కోరారు. సమస్య పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు మెయిన్ రోడ్డు అసోసియేషన్ సభ్యులు తెలిపారు.






