26 August, 2026 | 2:12 AM

చక్కెర కిలో రూ.70!

26-08-2026 12:53 AM
  1. ధరల దూకుడు.. సర్కారు నిద్రమత్తు
  2. నెల రోజుల్లోనే 15 శాతం పెరిగిన ధర
  3. తగ్గుతున్న ఉత్పత్తి, పెరుగుతున్న డిమాండ్
  4. దిగుమతిపై సుంకాల ప్రభావం
  5. భవిష్యత్తు అవసరాలు, అంచనాల్లో కేంద్రం విఫలం
  6. వినియోగదారులపై ఆర్థిక భారం   

హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాం తి): చక్కెర ధరలు సామాన్యుడిని బెంబే లెత్తిస్తున్నాయి.కిలో రూ.70 దిశగా పరుగుతు పెడుతోంది. ఏటికేడు ఉత్పత్తి తగ్గుతున్నా కేంద్రం నిద్రమత్తు వీడటం లేదని, భవిష్యత్తు అవసరాలపై అంచనాలు, సరైన ప్రణాళికలు లేకపోవడంతో ధరలు అదుపుతున్నాయని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఫలితంగా పండుగల వేళ ప్రతి ఇంటా తీపి వంటకాల సందడి ఉండాల్సిన సమయం లో.. పెరుగుతున్న చక్కెర ధరలు  సామాన్యుడికి చేదు రుచిని మిగులుస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే కిలో చక్కెర ధర 15 శాతం వరకు పెరిగింది. జూలై 20న కిలో  రూ.48 ఉండగా, ఈనెల 20 నాటికి రూ. 55 దాటింది. ప్రధాన నగరాల్లో రిటైల్  ధర రూ.70 కి చేరింది.  

ప్రభుత్వ అలసత్వం, అంచనాల్లో వైఫల్యం

ఇది కేవలం సాధారణ మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల జరిగింది కాదు. ప్రభుత్వ అలస త్వం, అంచనాలు వేయడంలో వైఫల్యం కారణంగా తలెత్తిన సంక్షోభమని స్పష్టమవుతో ంది. ఈ సమస్య ఒక్క రోజులో తలెత్తింది కాదు. దేశంలో చెరకు పంట విస్తీర్ణం తగ్గడం, ప్రతికూల వాతావరణం, వర్షాభావ పరిస్థితుల వల్ల చక్కెర ఉత్పత్తి ఏటేటా క్షీణిస్తూ వస్తోంది. 2021 దేశంలో ఉత్పత్తి అయిన చక్కెర 35.9 మిలియన్ టన్నులుగా కాగా.. 2023 నాటికి 32 మిలియన్ టన్నులకు పడిపోతుందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.

ఈ ఆగస్టులో కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మం త్రిత్వ శాఖ ఒక ప్రకటన చేస్తూ.. ఈ సీజన్‌లో 30.6 మలియన్ టన్నుల చక్కెర మాత్రమే ఉత్పత్తి అవుతుందని, గతంలో వేసిన అంచనాలు 34.5 మిలియన్ టన్నులని స్పష్టం చేయడం ఇక్కడ గమనార్హం. అంటే ఉత్పత్తి అంచనాలు ఎంత దారుణంగా దెబ్బతిన్నా యో ఈ గణాంకాలే నిరూపిస్తున్నాయి.

ఉత్పత్తులు తగ్గుతాయని స్పష్టమైన సూచనలు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ సకాలంలో స్పందించడంలో తీవ్రంగా విఫలమైంది. ధరలు పెరిగే అవకాశం ఉందని ముందుగానే స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లనే ఈ రోజు దేశంలో ‘చక్కెర’ సంక్షోభం ఏర్పడిందని ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్తలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

దిగుమతిపై 100 శాతం సుంకం

ప్రభుత్వ పన్నుల విధానం గురించి ఇక్క డ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. దేశీయంగా చక్కెర నిల్వలు తగ్గిపోతున్నప్పుడు.. ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకుని ధరలను అదుపులోకి తేవడం మార్కెట్ ప్రాథమిక సూత్రం. కానీ ప్రభుత్వం ఈ విషయాన్ని పూర్తిగా విస్మరించింది. మార్కెట్లో కొరత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. చక్కెరపై ఏకంగా 100 శాతం దిగుమతి సుంకాన్ని కొనసాగించడం ప్రభుత్వ విధానపరమైన లోపానికి నిదర్శనం.

ఒకవైపు దేశీయ ఉత్పత్తి తగ్గుతుంటే, మరోవైపు భారీ దిగుమతి సుంకాల వల్ల ఇతర దేశాల నుంచి చక్కెరను దిగుమతి చేసుకోవడం తీవ్ర భారంగా మారింది. ఈ రెండు కారణాలు కలసి మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టించాయి. దీని ఫలితమే చక్కెర ధరలు అమాంతం పెరగడం.ఈ విధానపరమైన లోపాలను కొంత మంది వ్యాపారులు, పారిశ్రామిక వర్గాలు తమకు అనుకూలంగా మలుచుకున్నాయనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి.

పండుగల సీజన్ కావడంతో మార్కెట్లో డిమాండ్ ఊహించని విధంగా పెరిగింది. ఇదే అదనుగా కొందరు హోల్‌సేల్ వ్యాపారులు సరుకును బ్లాక్ మార్కెట్‌కు తరలించడం, అక్రమంగా నిల్వ చేశారు. పరిస్థితి చేయి దాటిన తర్వాత నిల్వలపై పరిమితులు విధించడం, కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించడం మొదలుపెట్టింది. కానీ, ఆలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయి ంది.

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ప్రభుత్వం వ్యవహరించిం ది.చక్కెర పరిశ్రమ అనేది భారతదేశంలో అత్యంత నియంత్రణలో ఉండే రంగం. చెర కు మద్దతు ధర నుండి ప్యాకేజింగ్, కోటాల కేటాయింపుల వరకు ప్రతి విషయంలోనూ ప్రభుత్వ నిర్ణయమే అత్యంత కీలకం.

అలాంటప్పుడు, ఇప్పుడు మార్కెట్లో సంభవించిన ఈ తీవ్రమైన ధరల పెరుగుదల బాధ్యతను ప్రభుత్వం పూర్తిగా వహించాల్సిందే. వ్యవసా య రంగ నిపుణుల హెచ్చరికలను నిర్ల క్ష్యం చేయడం, పండుగల సమయానికి అవసరమైన నిల్వలను ముందే సమీక్షిం చకపోవ డంవల్ల ఇప్పుడు ఆ చక్కెర భారాన్ని  సామాన్యుడు తన జేబు నుంచి చెల్లించాల్సి వస్తోంది.

ఇలా చేస్తేనే..

ఇప్పటికైనా ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా తక్షణమే రంగం లోకి దిగాలి. చక్కెరపై ఉన్న అధిక దిగుమతి సుంకాలను వెంటనే పునఃసమీక్షించి, విదేశీ దిగుమతులకు మార్గం సుగమం చేయాలి. మార్కెట్ వ్యాప్తంగా కృత్రిమ కొరత సృష్టిస్తున్న అక్రమ వ్యాపారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.

తనిఖీలు నిర్వహించి, అక్రమ నిల్వలను బయటకు వచ్చేలా చేయా లి. రాబోయే పండుగల కాలంలో పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించాలంటే.. బహిరంగ మార్కెట్‌లో చక్కెర ధరలను అదుపు చేయడమే కాకుండా ప్రజా పంపినీ వ్యవస్థల ద్వారా సబ్సిడీ రేటుకు నిత్యావసర చక్కెరను అందుబాటులోకి తీసుకురావడం అత్యంత ఆవశ్యం.