26 August, 2026 | 3:53 AM

ఏబీవీపీ పోరుగర్జన

26-08-2026 01:42 AM
  1. ఫీజు బకాయిలపై పాలమూరులో భారీ ర్యాలీ
  2.    5 వేల మందితో ‘స్టూడెంట్ మార్చ్’
  3. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట ధర్నా   
  4. రూ.12వేల కోట్లు తక్షణమే విడుదల చేయాలి
  5. సర్కార్ స్పందించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం 
  6. ఏబీవీపీ నాయకుల హెచ్చరిక     

మహబూబర్‌నగర్, ఆగస్టు 25 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షి ప్ అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీ పీ పాలమూరు జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కేం ద్రంలో మంగళవారం ఆందోళన చేపట్టింది. పోరుగర్జన పేరుతో సుమారు 5 వేల మంది విద్యార్థులతో మెట్టుగడ్డ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించింది.

రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేసింది. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జీవన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం సకలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ విడుదల చేయకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది చదువులపై ప్రభావం పడుతుందన్నారు.

ఏటా సుమారు 2 లక్షల మంది విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని, మరో 4.5 లక్షల మంది తాము చదివిన కళాశాలల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక ఉన్నత చదువులకు దూరమవుతున్నారని, ఉద్యోగ అవ కాశాలు వచ్చినా వెళ్లలేకపోతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెం టనే బకాయిలు చెల్లించడంతో పాటు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి ప్రతి నెలా ఫీజు రీ యింబర్స్‌మెంట్ విడుదల చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

స్వయంగా విద్యాశాఖ బాధ్యతలు కూడా ని ర్వహిస్తున్న సీఎం.. మూడుళ్లు కావస్తున్నా ఫీ జు బకాయిలు విడుదల చేయడంలో విఫ లం అయ్యారని విమర్శించారు. ప్రైవేట్ కాలేజీలు, ప్రభుత్వం  కలిసి ఆడుతున్న నాటకం లో విద్యార్థులు బలిపశువులు అవుతున్నార ని ఆవేదన వ్యక్తం చేశా రు. బడ్జెట్ కాలేజీలు ఆర్థిక ఇబ్బందులతో మూతపడే పరిస్థితి ఏ ర్పడిందని, ఉపాధి కోసం లెక్చరర్లుగా పనిచేస్తున్న నిరుద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

‘ఫీజు రీయిబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ విద్యార్థుల హక్కు.. ప్రభుత్వం పెట్టే భిక్ష కాదు’ అని జీవన్ స్పష్టం చేశారు. హక్కుల కోసం ప్రశ్నిస్తున్న విద్యార్థులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, నిరసనలకు దిగితే లాఠీచార్జీలు, అక్రమ కేసులతో అణచివేయాలని చూస్తుందనిఆరోపించారు. తక్షణమే రూ.12 వేల కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం

తెలంగాణ విద్యార్థులకు ఉద్యమాలు, అణచివేతలు కొత్తేమీ కాదని ఏబీవీపీ నా యకులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ని ర్లక్ష్యానికి నిరసనగానే 5 వేల మంది వి ద్యార్థులతో ‘స్టూడెంట్ మార్చ్’ నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనై నా కళ్లు తెరవకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్య మం చేపడుతామని హెచ్చరించారు.

రాష్ట్రంలోని అన్ని కళాశాలు, విశ్వవిద్యాలయాలను ఉద్యమ వేదికలుగా మార్చి ప్ర భుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాలమూరు విభాగ్ కన్వీనర్ అర్జున్ సాతర్ల, జిల్లా కన్వీనర్లు సౌమ్య, శాంతన్, నరేష్, కార్తీక్, అలాగే నవీన్, మణి, బంటి, గణేష్, శివ సాయి, ప్రణయ్, సతీష్, ఇంతియాజ్, ప్రసాద్  తదితరులు పాల్గొన్నారు.