26 August, 2026 | 3:43 AM

పాలిటెక్నిక్ విద్యార్థులతో రేవంత్ చెలగాటం

26-08-2026 01:30 AM

సెప్టెంబర్ 7లోగా జీవో 97 రద్దు చేయకపోతే లక్ష మందితో సెక్రటేరియట్ ముట్టడి

మాజీమంత్రి హరీశ్ రావు 

హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): లక్ష మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో రేవంత్ రెడ్డి చెలగాటమాడుతున్నారని, సెప్టెంబర్ 7లోగా జీవో నెం. 97ను రద్దు చేయకపోతే లక్ష మందితో సెక్రటేరియట్ ముట్టడిస్తామని మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఆయన సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి పాలన చూస్తుంటే పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను తీసుకెళ్లి ఐటీఐలతో కలుపుతామంటూ స్కిల్ యూనివర్సిటీకి అప్పగించాలని చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 113 పాలిటెక్నిక్ కళాశాలలు ఉంటే, అందులో 59 ప్రభుత్వ కాలేజీలను  ప్రైవేటు పరం చేయాలని చూ స్తున్నారన్నారు.

రేవంత్ రెడ్డి కమిటీల పేరు తో డ్రామాలు ఆపాలని, ఇది పోరాడుతున్న విద్యార్థులపై నీళ్లు చల్లి, ఉద్యమాన్ని నీరుగార్చే దొంగ కమిటీ అన్నారు. తాను, కేటీఆర్ విదేశాలకు వెళ్లడానికి కేంద్రం అనుమతి ఇ స్తుందంటూ  రేవంత్‌రెడ్డి కనీస జ్ఞానం లే కుండా మాట్లాడుతున్నారన్నారు. తాము కే వలం ఎమ్మెల్యేలు మాత్రమే..   ఎమ్మెల్యే వి దేశాలకు వెళ్లడానికి కేంద్రానికి ఎలాంటి దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు.