15 June, 2026 | 8:19 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

భీంగల్ పట్టణంలో విజయ దివస్‌లో పాల్గొన్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

10-12-2025 01:16 AM

భీంగల్, డిసెంబర్ 9 (విజయ క్రాంతి): డిసెంబర్ 9 ప్రకటన సందర్భంగా మంగళవారం నాడు విజయ దివస్ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూల దండ వేసి, తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.ఉద్యమసారథి కేసీఆర్ దీక్ష ఫలితంగా వచ్చిన డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు, ఈన కాచి నక్కల పాలు చేసినట్లు కేసీఆర్ కడుపులో పెట్టుకుని సాదుకున్న తెలంగాణ నేడు దోపిడి దొంగల పాలైంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ..

ఉద్యమసారథి కేసీఆర్ దీక్ష ఫలితంగా వచ్చిన డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు. గుక్కెడు తాగు, సాగు నీళ్లు లేక గోస పడుతున్న తెలంగాణ. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అడవిబాట పడుతున్న వేళ. ఇలాంటి దుర్భిక్ష పరిస్థితులను చూసి కలత చెందిన కేసీఆర్ మా తెలంగాణ మా ఇవ్వాలని కోట్లాడిన సందర్భం.  2004 కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పితే కేసీఆర్ చావు నోట్ల తలకాయ పెట్ట దీక్ష చేస్తే దిగొచ్చిన యూపీఏ సర్కార్ 2014 లో తప్పనిసరి పరిస్థితిలో ప్రకటన చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వలేదు. 2004 లోనే ఇవ్వాలి.

కానీ పదేళ్ల ఆలస్యం తరువాత తెలంగాణ ప్రకటన చేశారు. ఈ ఆలస్యం అనేక మంది బిడ్డల అతబలిదానం చేశారు. కేసీఆర్ పోరాటం వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. రైతులను ఆదుకునే దిక్కులేదు కానీ రైజింగ్ తెలంగాణ అని పోకడకు పోతున్నాడు. మక్కలు కేవలం 25 శాతం మాత్రమే కొనుగోలు చేసి చేతులు దులుపుకున్న రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది. రెండు నెలలుగా రైతులకు మక్కల డబ్బులు ఇవ్వట్లేదు,  యూరియా సరిగా రావట్లేదు.  రైతులకు కరెంటు సరిగా ఇవ్వట్లేదు. కరెంటు కోతలు పెరిగినాయి. వరికి రూ.500ల  బోనస్ ఇవ్వలేదు. 

సగం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యింది. ఆడబిడ్డలకు రూ. 2500 లు లేవు. ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం లేదు.ఆసరా పెన్షన్ 4000 లేదు. రూ. వేల కోట్ల విలువైన భూములు అమ్మే పని రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు.  రాష్ట్రంలో రాక్షసుల, రాబందుల పాలన కొనసాగుతోంది. కేసీఆర్  బ్రహ్మాండంగా మార్చిన తెలంగాణను మళ్ళీ ఆంధ్రోళ్ల చేతుల్లో పెట్టే కుట్ర చేస్తున్నారు. ఇట్లాంటి కుట్రలు ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడాలి.