10-12-2025 01:18:16 AM
తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి
ముషీరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ అమరవీరుల త్యాగాల ను స్మరించుకునే విధంగా ఢిల్లీలోని బాబుగాటు లాగ నిత్యం వెలిగే జ్యోతితో కూడిన స్థూపాన్ని తెలంగాణలో నిర్మాణాన్ని చేపట్టాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం డిసెంబర్ 9 సందర్భంగా గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడా రు. అమరుల ఆత్మలు సంతోషించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిత్యం వెలిగే జ్యోతితో కూడిన స్థూపాన్ని నిర్మించాలని కోరారు.