10-12-2025 01:15:58 AM
వరంగల్ (మహబూబాబాద్) : అవినీతికి పాల్పడడంకన్నా.. అడుక్కు తినడం మిన్న.. అంటూ మంగళవారం హనుమకొండలో జ్వాలా అవినీతి వ్యతిరేక సంస్థ, లోక్ సత్తా ఆధ్వర్యంలో యాచకులతో వినూత్న ర్యాలీ నిర్వహించారు. లోక్ సత్తా ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షుడు బండారు రామ్మోహనరావు, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు, జ్వాలా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విభాగాల్లో అవినీతి, లంచం సర్వసాధారణంగా మారిపోయిందని, ఏసీబీ అధికారులు పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నా మార్పు రావడం లేదన్నారు.