24-05-2025 12:00:00 AM
క్షతగాత్రుడిని తన వాహనంలో ఆసుపత్రికి తరలించిన సబిత ఇంద్రారెడ్డి
మహేశ్వరం,మే 23 : మహేశ్వరం గేటు వద్ద రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటుతున్న సిబ్బందిపైకి ద్విచక్ర వాహనం దూసుకురావడంతో శుక్రవారం ఒక వృద్ధుడికి స్వల్ప గాయాలయ్యాయి. మహేశ్వరం నియోజకవర్గంలో పలు వివాహా వేడుకల్లో పాల్గొని మహేశ్వరం నుండి హైదరాబాద్ వైపుగా వెళ్తున్న మాజీ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం గేటు వద్ద జరిగిన సంఘటనను చూసి తన కాన్వాయ్ ఆపి బాధితున్ని పరామర్శించి ఆసుపత్రికి పంపించి దాత్రుత్వం చాటుకున్నారు.
ఎమెల్యేతో పాటు మహేశ్వరం నియోజకవర్గం బిఆర్‌ఎస్ పార్టీ సెక్రటరీ సామ మహేందర్ రెడ్డి, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రామ్ రెడ్డి,బిమిడి జంగారెడ్డి,నందినేని నరేందర్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షులు లచ్యా నాయక్, వెంకట రాజిరెడ్డి, మహేశ్వరం మండలం పిఎసిఎస్ డైరెక్టర్ కాడమోని ప్రభాకర్,వద్ది శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.