calender_icon.png 24 May, 2025 | 6:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రాజీనామా చేయాలి

24-05-2025 11:44:48 AM

  1. ఈడీ ఛార్జిషీట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదు
  2. రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది కేంద్రప్రభుత్వమే
  3. తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి 

హైదరాబాద్: తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి.. ఆ దయ్యాన్ని ఎలా వదలకొట్టాలి అనేదే మా తాపత్రయమని మాజీ మంత్రి కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి డబ్బులు కావాలంటే తెలంగాణ నుంచి తరలిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. అధిష్ఠానానికి డబ్బులు ఇస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) పదవిని కాపాడుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి రూ. 50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్న మాటలను కేటీఆర్ గుర్తు చేశారు. 

రేవంత్ రెడ్డి మాటల ముఖ్యమంత్రి కాదని.. మూటల ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ నేతలు(Congress leaders) అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా పేరుతో వసూల్లు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీలో ఇద్దరు బాసులు ఉన్నారు.. ఒకరు రాహుల్ గాంధీ(Rahul Gandhi), మరొకరు ప్రధాని నరేంద్ర మోదీ అని కేటీఆర్ అన్నారు. ఈడీ ఛార్జిషీట్(ED Chargesheet) లో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉంటే రాహుల్ గాంధీ ఎందుకు  స్పందించలేదు, ఈడీ ఛార్జిషీట్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలేదని కేటీఆర్ ప్రశ్నించారు. గతంలో ఆరోపణలు వచ్చిన సీఎంలు, కేంద్రమంత్రులు పదవుల నుంచి తప్పుకున్నారు.

పొంగులేటి(Ponguleti Srinivasa Reddy) ఇంటిపై దాడి జరిగితే వార్త రాదు.. గత మేలో తెలంగాణలో ఆర్ఆర్ఆర్ ట్యాక్స్(RRR Tax) నడుస్తోందని మోదీ అన్నారు. ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ పై ప్రధాని మోదీ(Prime Minister Modi) ఎందుకు విచారణకు ఆదేశించట్లేదని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది కేంద్రప్రభుత్వామేనని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చేసిన తప్పులకు సీఎం రేవంత్ రెడ్డి శిక్ష అనుభవించాల్సిందేనని కేటీఆర్(KTR) హెచ్చరించారు. ఆనాడు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప హౌసింగ్ స్కాంకు పాల్పడినప్పుడు, కాంగ్రెస్ నాయకులంతా ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళు చేసిన డిమాండ్ల మేరకు యెడ్యూరప్ప రాజీనామా చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలి, లేదంటే కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డితో రాజీనామా చేయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

నేషనల్ హెరాల్డ్ కేసు(National Herald case) గురించి తెలంగాణలో బీజేపీ ఎంపీలు ఎవరూ మాట్లాడడం లేదని ఆరోపించిన ఆయన  కర్ణాటక బీజేపీ నాయకులంతా డీకే శివకుమార్ ను నిలదీస్తుంటే, తెలంగాణ బీజేపీ నాయకులకు రేవంత్ రెడ్డి అంటే ఎందుకు అంత ప్రేమ అన్నారు. బీజేపీ ఎంపీ భూ దందాలకు, బీజేపీ కేంద్ర మంత్రుల అక్రమాలకు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నాడని మౌనంగా ఉంటున్నారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kalvakuntla Kavitha) బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao)కు రాసిన లేఖపై కేటీఆర్ స్పందించారు. పార్టీ అధినేతకు సూచనలు చేయాలంటే లేఖలు రాయవచ్చు అన్నారు. అంతర్గత విషయాలు.. అంతర్గతంగానే మాట్లాడితే మంచిదని సూచించారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందన్నారు. అంతర్గతంగా మాట్లాడే అంశాలు బయట మాట్లాడటమ సరికాదన్నారు. పార్టీలో అందరం కార్యకర్తలమే.. ఇది అందరికీ వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కోవర్టులు సమయం వచ్చినప్పుడు వారే బయటపడతారని చెప్పారు. అన్ని పార్టీలోనూ కోవర్టులు ఉంటారు. తమ పార్టీలోనూ రేవంత్ రెడ్డి కోవర్టులు ఉంటే ఉండొచ్చన్నారు. తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్.. దెయ్యం రేవంత్ రెడ్డి అని కేటీఆర్ అన్నారు.