24-05-2025 11:46:41 AM
పట్టించుకోని అధికారులు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మండలంలోని వేల్పుచర్ల గ్రామ 8వ వార్డులో కొన్ని నెలలుగా వీధి దీపాలు వెలగక అంధకారంలో ఉండడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.వర్షాకాలం సమీపిస్తుండడంతో రాత్రి వేళలో వీధి దీపాలు వెలగక ఎక్కడ నుంచి పాములు,తేల్లు,పురుగులు వచ్చి కాటేస్తాయోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని గ్రామస్తుడు ఖమ్మంపాటి జగన్ ఆవేదన వ్యక్తం చేశాడు.ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే వీధిలైట్లు వేయించాలని కోరారు.