24-05-2025 11:48:37 AM
భూత్పూర్ : మహిళలకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని విఎన్ వి విజనరీ అసోసియేషన్(VNV Visionary Association) డైరెక్టర్ దర్శన రమేష్ అన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని వెల్కిచర్ల గ్రామంలో మహిళలకు అగర్బత్తిలా ఉచిత తయారీ శిక్షణను ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గృహిణి మహిళలకు ఉపాధి కల్పించడం కోసం వర్క్ ఫ్రం హోం(Work from home) ద్వారా అగర్బత్తిలా తయారీ శిక్షణ ఇచ్చి తమ ఇంటి వద్దకే పనిని కల్పించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. మూడు నెలల తర్వాత మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు కూడా వస్తాయన్నారు. ఎలాంటి కెమికల్ లేకుండా న్యాచురల్ గా అగర్బత్తిలా తయారు చేయడం నేర్పిస్తున్నామని అన్నారు. గృహిణి మహిళలు ఇంట్లోనే ఉండి సులువుగా పనిని చేసుకునే విధంగా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ రాణి, కవితా సహిబా, టీం లీడర్ సాజిదా బేగం, తదితర మహిళలు ఉన్నారు.