calender_icon.png 24 May, 2025 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

24-05-2025 10:55:20 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో(Kadapa district) శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన లారీ, కారు ఢీకొని ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సి.కె.దిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్(Guvvalacheruvu Ghat Road) వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గువ్వల చెరువు ఘాట్ మలుపు వద్ద దూసుకొచ్చిన లారీ కారుపైకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న ఐదుగురు మృతి చెందారు. రాయచోటి నుంచి కడపకు కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో చిన్నారి, ముగ్గురు మహిళలు ఉన్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం విచారణ జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.