01-02-2026 04:37:40 PM
కాకతీయ యూనివర్సిటీ,(విజయక్రాంతి): పాలన చేతకాక, హామీల అమలు చేసే తెలివిలేక, ప్రజల దృష్టి మళ్లించేందుకే, తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ అనే అక్రమ కేసులో నోటీసులు ఇచ్చి సిట్ విచారణకు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ఎర్రగట్టు గుట్ట వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మండల, డివిజన్ అధ్యక్షులు, PACS మాజీ చైర్మన్లు, ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.