1 August, 2026 | 5:00 PM

పోలింగ్ ఏజెంట్‌గా మాజీ ఎమ్మెల్యే

28-05-2024 12:49 AM

భద్రాద్రి కొత్తగూడెం మే 27 (విజయక్రాంతి): భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా  దుమ్ముగూడెం మండల కేంద్రంలోని 229 పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఏజెంట్‌గా కూర్చోవడం చర్చనీయాంశమైంది. సాధారణంగా ఏజెంట్‌గా మండల, గ్రామ స్థాయి నేతలు వ్యవహరిస్తారు. కానీ ఆ పార్టీకి విధేయుడిగా పేరున్న వీరయ్య ఎమ్మెల్యేగా చేసి, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ కూడా ఏజెంట్‌గా వ్యవహరించడం రాజకీయ వర్గాల్లో  చర్చ నడిసింది.