పరామర్శ
కొత్తపల్లి,(విజయక్రాంతి): ఇటీవల మృతి చెందిన పొన్నం శ్రీకాంత్, బండ సురేందర్ రెడ్డిల అకాల మరణం అత్యంత బాధాకరమని వారి వారి కుటుంబాలను సీపీఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పరామర్శించారు. కరీంనగర్ నగరంలోని రేకుర్తి, హౌసింగ్ బోర్డు కాలనీ లో నివాసముంటున్న మృతుల కుటుంబాల ఇంటికి వెళ్లి శ్రీకాంత్, సురేందర్ రెడ్డి ల చిత్ర పాటలకు నివాళ్ళర్పిస్తూ మృతి వివరాలను తెలుసుకున్నారు.
గత మూడు రోజుల క్రితం యాక్సిడెంట్లో మరణించిన గ్రంధాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ సోదరుని మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని,అతి చిన్న వయస్సులో శ్రీకాంత్ మరణం వారి కుటుంబానికి ఎంతో బాధ కలిగిస్తుందని అలాగే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి గత కొంత కాలంగా అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ ఆకస్మికంగా మృతి చెందడం వామపక్ష ఉద్యమానికి తీరనిలోటు అని ఆయన మరణం తనను ఎంతో బాధించిందని,
తాను సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో వామపక్షాల సమావేశాలలో, ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే అనేక పోరాటాలలో తనతో సురేందర్ రెడ్డి కలిసి పనిచేశారని అలాంటి వ్యక్తి మరణం జీర్ణించుకోలేని విషయమని,వారి కుటుంబం సభ్యులకు సానుభూతి తెలుపుతున్నట్టు చాడ వెంకటరెడ్డి తెలిపారు. పరామర్శించిన వారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు,బూడిద సదాశివ మరియు అల్గునూర్ మాజీ సర్పంచ్ జె. వి. రమణా రెడ్డి ఉన్నారు.






