05-12-2025 08:53:45 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ప్రైవేటు వ్యాపారస్తులు ధాన్యం పంట తూకాల్లో మోసాలకు పాల్పడితే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునిలా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ నిర్మల్ ప్రాంతాల్లో కొందరు దళారి వ్యాపారులు వరి మొక్కజొన్న ఇతర పంటలు కొనుగోలలో ఎలక్ట్రానిక్ కాంటాలో ట్యాంపరింగ్కు పాల్పడుతూ రైతులకు మోసం చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. మార్కెట్ కమిటీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి రైతులకు ప్రయోజనం చేకూర్చేలా చూడాలని తెలిపారు.