23 June, 2026 | 10:25 AM

సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన

05-12-2025 08:45 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు అన్ని  పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సైబర్ నేరాలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. సైబర్ పోలీస్ సిబ్బందితోపాటు నారి శక్తి పోలీసులు ఆయా ప్రభుత్వ పాఠశాలలో మహిళా సంఘాల వద్ద బస్టాండ్లలో వివిధ ప్రాంతాల్లో సమాజంలో జరుగుతున్న ఆర్థిక నేరాలు వాటి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసులు పాల్గొన్నారు.