4 March, 2026 | 2:44 AM

మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాతృమూర్తి కన్నుమూత

04-03-2026 12:54 AM

తరలివచ్చిన రాజకీయ ప్రముఖులు

కడ్తాల్, మార్చి 3 (విజయక్రాంతి): కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే శ్రీ జైపాల్ యాదవ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి మంగమ్మ(95) మంగళవారం తెల్లవారుజామున స్వగ్రామం చల్లంపల్లిలో కన్నుమూశారు. ఆమె మృతితో నియోజకవర్గవ్యాప్తంగా విషాదఛాయలు అలముకున్నాయి.

విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు చల్లంపల్లికి చేరుకుని ఆమె భౌతికకాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. జైపాల్ యాదవ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

నివాళులర్పించిన వారిలో కసిరెడ్డి నారాయణరెడ్డి (ఎమ్మెల్యే),ఎగ్గే మల్లేశం (ఎమ్మెల్సీ) మాజీ ఎమ్మెల్యే లు అంజయ్య యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీలు పరాములు, బడుగుల లింగయ్య యాదవ్,గోలి శ్రీనివాస్ రెడ్డి (రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్),దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ (మాజీ గొర్రె కాపరుల అభివృద్ధి సంస్థ చైర్మన్),ఉప్పల వెంకటేష్ (మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్), బిజెపి రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్ తో పాటు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మంగమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ క్లిష్ట సమయంలో జైపాల్ యాదవ్ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని వారు ఆకాంక్షించారు. మంగమ్మ అంత్యక్రియలను కుటుంబ సభ్యులు వారి స్వగ్రామమైన చల్లంపల్లిలోనే నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు అభిమానులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు కడసారి వీడ్కోలు పలికారు.