రాజ్యసభ నామినేషన్లకు రేపే ఆఖరు
- ఒక్కటి కూడా దాఖలు కాని వైనం
- నేడు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్న కాంగ్రెస్
హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు గురువారంతో నామినేషన్ల గడు వు ముగుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఖాళీ అవుతున్న రెండు స్థానాలకు గాను అసెంబ్లీలో ఎమ్మెల్యే సంఖ్యా బలాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీకి ఒకటి పూర్తి మెజార్టీతో దక్కనుండగా, రెండో సీటులో విజయం కోసం ఎంఐఎం, సీపీఐతో పాటు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల మద్దతుతో చేజిక్కించుకునే అవకాశం ఉంది.
అయినప్పటిక కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయలేదు. బుధవారం సాయంత్రం వరకు రాజ్యసభ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది. రాజ్యసభ సీటు కోసం 42 మంది వరకు కాంగ్రెస్ అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రం నుంచి 16 మం దితో కూడిన జాబితాను ఢిల్లీ పెద్దలకు పం పించారు. ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠతో ఆశావాహులు ఎదురు చూస్తున్నారు.




