శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ
కందాళ ఉపేందర్ రెడ్డి ఘనంగా సత్కరించిన స్వామి ఆలయ కమిటీ
కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి మండలం, లింగారం తండా గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి, బొడ్రాయి, గరుడ స్తంభ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఆదివారం హాజరై ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మరియు గ్రామ యువజన నాయకులు వాడిత్య బాలకృష్ణ వారిని ఘనంగా సత్కరించింది. శాలువా కప్పి సన్మానించారు. ఆలయ నిర్మాణానికి, అన్నదాన కార్యక్రమాలకు వారు అందించిన ఆర్థిక సహకారం అభినందనీయం కమిటీ కొనియాడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరిని చల్లగా చూడాలని, అందరు బాగుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోతు పుష్ప రవి, గ్రామస్థులు బాలకృష్ణ, వెంకటేష్, రామూర్తి తదితరులు పాల్గొన్నారు.






