అడిషనల్ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన రాయల ప్రభాకర్ రావు
31-05-2025 01:18 AM
హనుమకొండ, మే 30 (విజయక్రాంతి): వరంగల్ పోలీస్ కమిషనరేట్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగం అదనపు డీసీపీగా రాయల ప్రభాకర్ రావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.
అనంతరం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ను మర్యాదపూర్వకంగా కలసి మొక్కను అందజేశారు. ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీగా పనిచేస్తూ బదిలీపై వచ్చిన ప్రభాకర్ రావు గతంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏసిపి గా పనిచేయడంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ హోదాల్లో సమర్ధవంతంగా పనిచేశారు.






