26 July, 2026 | 1:37 PM

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత

26-07-2026 12:35 PM

వరంగల్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డికి ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హన్మకొండలోని ఆయన నివాసంలో ఇవాళ గుండెపోటు రావడంతో, కుటుంబ సభ్యులు హుటాహుటిన రోహిణి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన రోహిణి ఆసుపత్రి డాక్టర్ సుధాకర్ రెడ్డి ఆయన పరిస్థితి క్రిటికల్ గా ఉందని వెల్లడించారు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR), మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్‌కు బయలుదేరారు.

మాజీ ఎంపీ బి.వినోద్ కుమార్, ఇతర బీఆర్ఎస్ నాయకులు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ... మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మరణించారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని, ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. పల్స్, బీపీ సరిగానే ఉన్నాయని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.