26 July, 2026 | 1:37 PM

యాదాద్రి క్షేత్రంలో పెరిగిన భక్తుల రద్దీ

26-07-2026 12:17 PM

యాదాద్రి: యాదాద్రి క్షేత్రంలో పెరిగిన భక్తుల రద్దీ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో భక్తులు బారులు తీరారు. ఆదివారం సెలవు కారణంగా జంట నగరాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారి ఆలయానికి విచ్చేశారు. స్వామివారి ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుందని భక్తులు వెల్లడించారు. భక్తులు అధికంగా శ్రీ స్వామివారి సుదర్శన నారసింహ హోమం, నిత్య కళ్యాణం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజుల్లో పాల్గొంటున్నారు. కొండపైనే ఉన్న శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ముక్కులు చెల్లించుకుంటున్నారు.