6 June, 2026 | 11:12 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే షిండే

26-11-2025 12:00 AM

బిచ్కుంద, నవంబర్ 25 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మంగళవారం పలు కార్యక్రమాలపై నియోజకవర్గంలో పర్యటిస్తూ స్థానిక జుక్కల్ చౌరస్తా వద్ద తన కారును ఆపి స్థానిక రైతులతో ముచ్చటించారు. అధికారులు సకాలంలో స్పందిస్తున్నారా,? బోనస్ రూ.500 ఖాతాలో పడుతున్నాయా.? అని అడగగా అధికారులు సరిగా పట్టించుకోవడంలేదని బోనస్ డబ్బులు గతంలో వేసిన పంటవే బోనస్ ఇప్పటివరకు రాలేదని వారు ఆవేదన వెల్లుబుచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ..

ప్రభుత్వం ప్రకటించిన సన్నరకం వడ్ల బోనస్ డబ్బులు అందేదెప్పుడోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత యాసంగి సీజన్ బోనస్ డబ్బులు పెండింగ్ లో ఉండగా, మూడు నెలలుగా బోనస్ డబ్బుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన రైతుల ఖాతాల్లో మాత్రం బోనస్ డబ్బులు జమ కాక పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోనస్ డబ్బుల కోసం  కార్యాలయాల మెట్లు ఎక్కుతూ,  అధికారులకు తమ గోడును మొర పెట్టుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తో పాటు బీఆర్‌ఎస్ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.