calender_icon.png 26 November, 2025 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి పోలీస్ మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి

26-11-2025 12:00:00 AM

కల్వకుర్తి డీఎస్పీ వెంకట్‌రెడ్డి

కల్వకుర్తి టౌన్, నవంబర్ 25 : ప్రతి పోలీస్ మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలని కల్వకుర్తి డీఎస్పీ వెంకట్ రెడ్డి అన్నారు. మంగళ వారం పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీలలో భాగంగా  డిఎస్పి తనిఖీ నిర్వహించి మాట్లాడారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను, పోలీస్ స్టేషన్ ను సందర్శించి, సిబ్బంది కిట్లను, వాహనాలను తనిఖీ చేసి పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సిబ్బంది అందరూ ఫిజికల్ ఫిట్నెస్ ను కాపాడుకుంటూ విధులు నిర్వహించాలని సూచించారు. 

పోలీస్ స్టేషన్ లోని అన్ని రికార్డులను తనిఖీ చేసి దొంగతనాలు జరగకుండా గస్తీ పటిష్టంగా నిర్వహించాలని, త్వరితగతిన దర్యాప్తు చేసి కేసులను చేదించాలన్నారు. కార్యక్రమంలో సిఐ నాగార్జున, ఎస్త్స్ర మాధవ రెడ్డి, ఎస్త్స్ర 2 రాజశేఖర్, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.