calender_icon.png 26 November, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

26-11-2025 12:00:00 AM

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

నవాబ్ పేట్ నవంబర్ 25 : దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని జడ్చర్ల ఎమ్మెల్యే అన్నారు. మంగళవారం మండలంలోని పత్తేపూర్ మైసమ్మ దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హాజరై,ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దైవ అనుగ్రహంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలియజేశారు.  కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రామచంద్రయ్య, ఆలయ చైర్మన్,ఆలయ సిబ్బంది, కాంగ్రెస్ మండల నాయకులు ఉన్నారు.