17 April, 2026 | 11:07 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

మాజీ ఎంపీపీ కిడ్నాప్ కలకలం

16-06-2025 12:00 AM
  1. ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఎత్తుకెళ్లిన దుండగులు 
  2. మెదక్ వద్ద తప్పించుకుని పోలీసులను ఆశ్రయించిన చిక్యాల హరీష్ కుమార్

నిర్మల్, జూన్ 15 (విజయక్రాంతి): డీసీసీబీ డైరెక్టర్ బీఆర్‌ఎస్ నేత మాజీ ఎంపీపీ చిక్యాల హరీష్ కుమార్ కిడ్నాప్ ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సంచలనం సృష్టించింది. జిల్లాలోని మామడ మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన సీహెచ్ హరీష్‌కుమార్ రెండు రోజుల క్రితం సొంత గ్రామమైన సోన్  వచ్చారు. శనివా రం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఓ కారులో వచ్చి హరీష్ కుమార్‌తో మాట్లాడేది ఆ ఇంట్లోకి ఇంటిలోకి ప్రవేశించారు.

మాస్కులు ధరించి హరీష్‌రావు పడుకున్న గదిలోకి వెళ్లిన దుండగులు ఆయన అరిచేలోపే బలవంతంగా బంధించి మత్తుమందు ఇచ్చి కారులో హైదరాబాద్ వైపు తీసుకెళ్లారు. మత్తు ప్రభావం కారణంగా హరీష్ కుమార్ నిద్రపోవడంతో ఆయన్ను కారులో తీసుకెళ్తుండగా మెదక్ జిల్లా చేరుకోగానే తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద హరీష్ కుమార్ మేలుకో వచ్చింది.

దీంతో అప్రమత్త మైన హరీష్ కుమార్ 5 గంటల ప్రాంతంలో టోల్ ప్లాజా వద్ద  ఒక్కసారిగా కార్ డోర్ తీసి కిందికి దిగి టూర్ ప్లాజా సిబ్బంది రూమ్‌కి పరిగెత్తడంతో వారంతా కూడా ఒక్కసారిగా ఆందోళన గురి అయ్యారు. కారులో ఉన్న దుడ్డగులు తాము దొరికిపోతామన్న భయం తో టోల్ ప్లాజా గేట్లు ఢీ కొట్టి హైదరాబాదు వైపు వెళ్ళిపోయినట్టు అక్కడ సిబ్బంది తెలిపారు.

వెంటనే టోల్ ప్లాజా సిబ్బంది ఈ విషయాన్ని తూప్రాన్ పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనకు చేరుకొని హరీష్‌కుమార్ వద్ద వివరాలు రాసుకొని నిర్మల్ పోలీసులకు సమాచారా న్ని అందించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేర కు నిర్మల్ పోలీసులు మెదక్ వెళ్లి కిడ్నాప్ గురై తప్పించుకున్న హరీష్ కుమార్ తమ ఆధీనంలోకి తీసుకొని పూర్తి వివరాలను ఆయననుండి ఇప్పటికి తెలుసు ఉన్నారు.

ఆదివారం మధ్యాహ్నం నిర్మల్ చేరుకున్న హరీష్ కుమార్ జరిగిన ఘటన వారి భాష అన్ని వివరాలను ఏఎస్పీకి ఫిర్యాదులో వివరించినట్టు తెలిపారు. దుండగుల వివరాల కోసం నిర్మల్ పోలీసులు ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఆధారంగా అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.  బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత వ్యాపారవేత్త అయిన హరీష్ కుమార్ ప్రస్తుతం డీసీసీబీ డైరెక్టర్‌గా వివరిస్తున్నారు ఇంతకుముందు  సదర్ మార్ట్ ఆయకట్టు చైర్మన్‌గా మామడ మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. 

హరీష్ కుమార్ కిడ్నాప్ వార్త తెలుసుకు నే వెంటనే ఆయన అభిమానులు మండల నాయకులు పెద్ద ఎత్తున నిర్మల్ పోలీస్ స్టేషన్ తరలివచ్చి ఆయన తో మాట్లాడారు. హరీష్ కుమార్‌ను కిడ్నాప్ చేయడానికి గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.