01-11-2025 07:39:40 PM
కామారెడ్డి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని శనివారం హైదరాబాదులో భిక్కనూర్ మాజీ ఎంపీపీ తోగరి సుదర్శన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తొగరి దశరథంలో కలిశారు. భిక్కనూర్ మండల్ కాచాపూరులో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సానుకూలంగా స్పందించారు. సీఎం నిధుల నుంచి అభివృద్ధి పనులు మంజూరు చేయిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని మాజీ ఎంపీపీ సుదర్శన్ సన్మానించి కృతజ్ఞతాలను తెలిపారు.