calender_icon.png 2 November, 2025 | 10:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూనియర్ కళాశాలలో ఘనంగా స్వాగత వేడుకలు

01-11-2025 07:41:53 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): విద్యార్థినీ విద్యార్థులు క్రమశిక్షణను అలవర్చుకొని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వరరావు సూచించారు. శనివారం భద్రాద్రి జిల్లాలోని ములకలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు స్వాగతం పలుకుతూ వెల్కమ్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. కళాశాలకు ప్రతిరోజు క్రమం తప్పకుండా హాజరై  అధ్యాపకులు బోధించే పాఠ్యాంశాలను గుర్తుంచుకోవాలని విద్యార్థులకు సూచించారు.

హాజరు శాతాన్ని పెంచి సిలబస్ను సకాలంలో పూర్తి చేసి ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అధ్యాపకులు కృషి చేయాలని కోరారు. ములకలపల్లి లోని జూనియర్ కళాశాలలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వాటిని ఉపయోగించుకొని విద్యార్థులు కష్టపడి చదువుకుని కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రిన్సిపాల్, జిల్లా పరీక్షల విభాగం సెంటర్ సభ్యురాలు సులోచన రాణి, స్థానిక ప్రిన్సిపల్ కల్పన అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఫ్రెషర్స్ కు సీనియర్స్ ఏర్పాటుచేసిన వెల్కమ్ డే లో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.