30 August, 2026 | 2:47 AM

ప్రజల పాలిట పొంగు‘లూటీ’

30-08-2026 12:52 AM
  1. 22-ఏ దందాతో రేవంత్‌రెడ్డికి సంబంధం లేకుంటే..
  2. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని భర్తరఫ్ చేయాలి
  3. మీ ఇద్దరి ఆస్తులే రాత్రికి రాత్రే జాబితా నుంచి ఎలా తీశారు?
  4. మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర హెచ్చరిక

సంగారెడ్డి బ్యూరో/పటాన్‌చెరు, ఆగస్టు 29 (విజయక్రాంతి): మంత్రి పొంగులేటి కాదు..ప్రజల పాలిట పొంగు లూటీ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. 22-ఏ దందాతో రేవంత్‌రెడ్డికి సంబంధం లేకుంటే.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ‘మీ ఇద్దరి ఆస్తులే’ రాత్రికి రాత్రే జాబితా నుంచి ఎలా తీశారు? అని నిలదీశారు.

తెలంగాణ రాష్ట్రంలో పేద, మధ్యత రగతి ప్రజల భూములను, ఇళ్ల ప్లాట్లను రాత్రికి రాత్రే 22-ఏ (నిషేధిత ఆస్తుల జాబితా) లోకి చేర్చి, వేలాది కుటుంబాలను రోడ్డున పడేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు కేంద్రంగా స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 22-ఏ భూ బాధితుల భారీ నిరసన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివి ధ గ్రామాల నుంచి వచ్చిన వేలాది మంది బాధితులతో హరీశ్‌రావు ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మా ట్లాడుతూ పటాన్‌చెరు నియోజకవర్గంలో రాత్రికి రాత్రే దాదాపు 50 వేల ఎకరాల భూములను 22-ఊ జాబితాలో పెట్టి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని తెలిపారు. ఈ భూములను వారం రోజుల్లోగా నిషేధిత జాబితా నుంచి తొలగించి,

సామాన్య యజమానులకు పూర్తి హక్కులు కల్పించాలన్నారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే వేలా ది మంది బాధితులతో కలిసి సంగారెడ్డి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరిక జారీ చేశారు. నిజమైన కబ్జాదారులు ప్రజలు కాదు.. రాత్రికి రాత్రే జీవోలు మారుస్తూ, పేదల ప్లాట్లను 22-ఏలో పెట్టి వేధిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే అసలైన కబ్జాదారు అంటూ నిప్పులు చెరిగారు. బాధితులెవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, న్యాయమైన ఆస్తి హక్కులు దక్కే వరకు బీఆర్‌ఎస్ పార్టీ క్షేత్రస్థాయి నుంచి అసెంబ్లీ వరకు రాజీలేని పోరాటం చేస్తుందని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు.

సామాన్యుల హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 1980లో లేఅవుట్ చేసి, 46 ఏళ్లుగా కాలనీల్లో ఇళ్లు కట్టుకుని నివసిస్తుంటే.. ఇప్పుడు వాటిని నిషేధిత జాబితాలో పెట్టి పిల్లల పెళ్లిళ్లు, చదువులు ఆపేస్తున్నారని, బ్యాంక్ లోన్లు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఒక తహసీల్దార్ ఏకంగా రెండు కోట్ల రూపాయ ల లంచం అడిగాడని, హైకోర్టు అక్షింతలు వేసినా ప్రభు త్వం పట్టించుకోలేదన్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో రాష్ట్రాన్ని పెట్టి రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి చోద్యం చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఇల్లు, మం త్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇల్లు కూడా 22-ఏ నిషేధిత జాబితాలోనే పడ్డాయని తెలిపారు. ఈ విషయం తాను బయటపెట్టగానే, ఎలాంటి అప్లికేషన్ లేకుండా, రాత్రికి రాత్రే వాళ్ల ఇళ్లను జాబితా నుంచి ఎలా తొలగించారని ప్రశ్నించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి కాదు.. ఆయన ప్రజలను లూటీ చేసే పొంగులూటీ అని విమర్శించారు.

హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి

22-ఏ భూముల వ్యవహారంలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని హరీశ్‌రావు ఆరోపించారు. ఎవ రి ఆదేశాల మేరకు ఈ భూములను నిషేధిత జాబితాలోకి చేర్చారు? మళ్లీ ఏ ప్రాతిపదికన తొలగిస్తు న్నారు? అనే విషయాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశా రు. ప్రభుత్వం దీనిపై తక్షణమే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని, సర్వే నంబర్ల వారీగా పూర్తి వివరా లను ప్రజల ముందు ఉంచాలని స్పష్టం చేశారు.