calender_icon.png 12 January, 2026 | 7:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లోకి మాజీ ఎంపీటీసీ సుమలత జైపాల్ రెడ్డి

12-01-2026 12:00:00 AM

మొయినాబాద్ జనవరి 11(విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన, సంక్షేమ పథకాల అమలు నచ్చి బి ఆర్ ఎస్ పార్టీ పెద్ద మంగళవారం గ్రామ మాజీ ఎంపీటీసీ పాటి సుమలత జైపాల్ రెడ్డి, పాటి సుధాకర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలాగంటి మధుసూదన్ రెడ్డి, టీపీసీసీ కార్యవర్గ సభ్యులు షాబాద్ దర్శన్, మొయినాబాద్ మండల పిఎసిఎస్ చైర్మన్ మందాడి చంద్రారెడ్డి, పెద్ద మంగళారం మాజీ సర్పంచ్ చేగురి రామకృష్ణ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్బంగ మాజీ ఎంపీటీసీ పాటి సుమలత జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాధరణ పొందుతూ సుస్థిర అభివృద్ధికై పాటుపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో బంగారు తెలంగాణ దిశగా అడుగులేస్తున్న చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధి కోసం  అహర్నిశలు కృషి చేస్తున్న  చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం అదృష్టంగా భావిస్తున్నాని అన్నారు.

కార్యక్రమంలో సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాబన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి చంద్రారెడ్డి, మందాడి రాఘవరెడ్డి, హిమాయత్ నగర్ మాజీ సర్పంచ్ పల్లగొల్ల మల్లేష్ యాదవ్, సురంగల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం వెంకట్ రెడ్డి, పల్లగొల్ల అశోక్ యాదవ్, మాజీ ఎంపీటీసీ పట్నం రాం రెడ్డి, రేణుట్ల రాజు గౌడ్, బేగరి రాజు, కొత్తపల్లి విక్రంరెడ్డి, కమ్మరి యాదగిరి చారి, ఏం సురేందర్ రెడ్డి, రామ్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు  పాల్గొన్నారు.