12-01-2026 12:00:00 AM
చేవెళ్ల కాంగ్రెస్ ఇన్చార్జి పామేన భీంభరత్
మొయినాబాద్ జనవరి 11(విజయ క్రాంతి): ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరంలాంటిదని, చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేన భీంభరత్ పేర్కొన్నారు. నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో మంజూరైన చెక్కులను ఆదివారం మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని అజీజ్ నగర్ లోని తన కార్యాలయంలో లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి అందజేశారు. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని వందలాది మంది పేదలకు చెక్కులు అందించినట్లు తెలిపారు.
రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్, మండల పార్టీ అధ్యక్షుడు మాణయ్య, ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, భద్రప్ప, మొయినాబాద్ లీగల్ సెల్ అధ్యక్షుడు బైకని కుమార్ యాదవ్, మాధవరెడ్డి, జొన్నాడ మైసయ్య, కేబుల్ రాజు, సురంగల్ వెంకట్ రెడ్డి, చంద్రశేఖర్, గోపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ జడ్పిటిసి, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గోన్నారు.