లొంగిపోతావా? నా కోపాన్ని చూస్తావా?
మనుమడికి మాజీ ప్రధాని దేవెగౌడ వార్నింగ్
బెంగళూరు, మే 23: దాదాపు 500 మందికి పైగా మహిళపై లైంగికదాడికి పాల్పడినట్టు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ, తన మనుమడు ప్రజ్వల్ రేవణ్ణపై ఆయన తాత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవె గౌడ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే పోలీసులకు లొంగిపోవాలని, లేదంటే తన కోపాన్ని చూస్తావని హెచ్చరించారు. ఈ అంశంపై కర్ణాటక ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారంపై ఈ నెల 18న నేను గుడికి వెళ్తున్న సమయంలో మీడియాతో మాట్లాడాను. ఈ షాక్‌నుంచి తేరుకొనేందుకు నాకు కొంత సమయం పట్టింది. ప్రజ్వల్ నేరం చేశాడని తేలితే కఠినంగా శిక్షించాలని నేను ఇదివరకే సూచిం చాను. ప్రజ్వ ల్‌కు ఒకటే చెప్తున్నా.. నువ్వు ఎక్కడ ఉన్నా వెంటనే వచ్చి పోలీసులకు లొంగిపో. విచారణకు సహకరించు. ఇది వినతి కాదు.. ఆదే శం. ఈ ఆదేశాన్ని అతడు పట్టించుకోకపోతే నా కోపాన్ని, కుటుంబం మొత్తం కోపాన్ని చూస్తాడు’ అని దేవెగౌడ పేర్కొన్నారు.






