1 August, 2026 | 6:28 PM

నేను రాజీనామా చేయను

24-05-2024 01:50 AM

ఆప్ ఎంపీ స్వాతి మలివాల్

న్యూఢిల్లీ, మే 23: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో ఎన్నికల సమయంలో మరో రచ్చకు ఆజ్యం పోసిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్.. ఏది ఏమైనా తగ్గేదే లే అంటున్నారు. ఏఎన్‌ఐకి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. తన ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ‘వాళ్లు (ఆప్) నా రాజ్యసభ సీటు కావాలనుకొంటే నన్ను అడగాల్సి ఉంటుంది. నేను నా జీవితాన్నే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చాలా చిన్న విషయమే. నేను ఏనాడూ పదవుల కోసం ఆశపడలేదు. 2006లో నా ఇంజినీరింగ్ ఉద్యోగాన్ని వదిలేసి ఆప్‌లో చేరాను. అప్పుడు నేనెవరో తెలుసుకోవాలని ఎవరూ అనుకోలేదు. అప్పుడు అక్కడ (పార్టీలో) ముగ్గురే ఉన్నారు. అందులో నేనూ ఒకరిని. నా వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తున్నారు. అందుకే నేను నా పదవికి రాజీనామా చేయను. ప్రస్తుతం నేనే అత్యంత పిన్న వయసు ఎంపీ ని. నేను ఇంకా కష్టపడి పనిచేస్తా. ఆదర్శంగా నిలుస్తా’ అని మలివాల్ పేర్కొన్నారు. ఆప్ అధికారంలోకి వచ్చాక నేతల్లో అహంకారం పెరిగిపోయిందని మలివాల్ విమర్శించారు.