17-01-2026 08:29:38 PM
మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుదాంష్ ను మునీరాబాద్ గ్రామ మాజీ సర్పంచ్ చిట్టిమిల్ల గణేష్ నేత మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత రెండు సంవత్సరాలుగా మునిరాబాద్ గ్రామంలో అపస్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ కమిషనర్ ను గ్రామ మాజీ సర్పంచ్ లు చిట్టిమిల్ల రాగాజ్యోతి గణేష్ ను కోరినట్లు చెప్పారు.మునిరాబాద్ గ్రామ పంచాయతీ గా ఉన్నప్పుడు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఉత్తమంగా ఉండేదని వారు తెలిపారు.గత రెండు సంవత్సరాల క్రితం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో విలీనమైనప్పటికీ నుండి గ్రామం అనేక సంస్థలతో కొట్టుమిట్టాడుతుందని వారు డిప్యూటీ కమిషనర్ కు వెల్లడించినట్టు చెప్పారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ గుండ్రోల్ల నర్సింగ్ రావు.సానిటరీ ఇన్స్పెక్టర్ భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.