calender_icon.png 17 January, 2026 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్ల రిజర్వేషన్లు ఖరారు

17-01-2026 08:32:18 PM

కరీంనగర్,(విజయక్రాంతి): రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన 66 డివిజన్లో రిజర్వేషన్ జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ రిజర్వేషన్ ప్రక్రియలో బీసీ, ఎస్సీ,  ఎస్టి, సాధారణ వర్గాలకు తోడు మహిళా కేటగిరీలకు పెద్దపీట వేయడం ప్రత్యేకతగా నిలిచింది. ప్రభుత్వం ప్రకటించిన జాబితా ప్రకారం మొత్తం 66 డివిజన్లలో గణనీయమైన సంఖ్యలో బీసీ, బీసీ మహిళా రిజర్వేషన్ కేటాయించబడింది.

1, 5, 10, 14, 17, 32, 34, 36, 37, 39, 43, 45, 46, 47, 48, 54, 56, 57, 58, 59, 61, 62, 63, 64 డివిజన్లు బీసీ వర్గానికి కేటాయించగా వీటిలో అనేకం మహిళా కేటగిరీకి చెందాయి. ఈ రిజర్వేషన్తో బీసీ వర్గం నుండి కొత్త నాయకుల ప్రవేశానికి దారులు తెరుచుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఎస్సీ వర్గానికి నాలుగు డివిజన్లో కేటాయించగా 4, 20, 25, 53, అందులో వార్డ్ 30, 27 లాంటి చోట్ల మహిళలకు రిజర్వు చేయబడింది. ప్రత్యేక కేటగిరీ అయిన ఎస్టీ కోటాకు మాత్రం ఈసారి ఒక్క డివిజన్ 28 మాత్రమే కేటాయించడం గమనార్హం.

మిగిలిన డివిజన్లు సాధారణ, సాధారణ మహిళా వర్గాలకు కేటాయించబడ్డాయి. ప్రధానంగా 2, 6, 8, 18, 21, 22, 23, 24, 26, 31, 42, 50, 66 వంటి డివిజన్లు జనరల్ కేటగిరీకి అమలవుతుండగా, 3, 7, 9, 11, 12, 13, 15, 16, 19, 33, 38, 40, 41, 44, 49, 52, 55, 60 వంటి ప్రాంతాల్లో మహిళలకే పోటీ అవకాశం లభించనుంది. రిజర్వేషన్ జాబితా విడుదలవడంతో రాజకీయ నాయకులు, పార్టీల ఎన్నికల వ్యూహాలు ఒక్కసారిగా మారిపోయాయి. అనేక డివిజన్లో గత ఎన్నికలో పోటీ చేసినవారు ఈసారి రిజర్వేషన్ మార్పుల కారణంగా తమ వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తోంది. కొంతమంది నేతలు కొత్త డివిజన్ల వైపు మొగ్గుచూపుతుండగా, యువ నాయకులు, మహిళలు, బీసీ అభ్యర్థులకు ఈ సారి పెద్ద అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరగా, రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయినందున కరీంనగర్ మున్సిపల్ ఎన్నికలు మరింత ఉత్కంఠగా మారనున్నాయి. పార్టీల మధ్య టికెట్ పోటీ, గల్లీ స్థాయిలో ప్రచారం, కొత్త సవాళ్లు, అనూహ్య రాజకీయ కలయికలు ముందున్న ఎన్నికలను రసవత్తరంగా మార్చనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.