calender_icon.png 17 January, 2026 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జై శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు

17-01-2026 08:26:02 PM

మహిళలు, బాలికలతో కళాత్మక సందడి 

కోదాడ: కోదాడ పట్టణంలోని ఆజాద్ నగర్‌లో జై శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో మహిళలు, బాలికల కోసం ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ సంస్కృతి, కళలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం నుంచే ఆజాద్ నగర్ ప్రాంతం రంగురంగుల ముగ్గులతో కళకళలాడింది. మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా ఈ పోటీలు ఆకట్టుకున్నాయి.

నిర్వహించిన ముగ్గుల పోటీల్లోమొదటి బహుమతి లక్ష్మి,రెండవ బహుమతి ప్రియాంక,మూడో బహుమతి త్రివేణి,నాలుగో బహుమతి ప్రియాంక, ఐదవ బహుమతి ఉదయశ్రీ గెలుచుకున్నారు. అంతేకాకుండా ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళలకు కన్సోలేషన్ బహుమతులు అందించారు. విజేతలకు జై శ్రీరామ్ యూత్ సభ్యులు బహుమతులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జై శ్రీరామ్ యూత్ సభ్యులు మాట్లాడుతూ... మహిళల్లో దాగి ఉన్న కళాత్మక ప్రతిభను వెలికి తీయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత విస్తృతంగా నిర్వహిస్తామని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో జై శ్రీరామ్ యూత్ సభ్యులు, మహిళలు, బాలికలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.