18 July, 2026 | 1:24 AM

డాక్టర్ విష్ణున్‌రావు రచించిన ‘శ్వాస’

18-07-2026 01:24 AM

పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

హైదరాబాద్, జూలై 17(విజయక్రాంతి): ప్రఖ్యాత శిశు అలెర్జీ, ఆస్తమా నిపుణులు, శ్వా స హాస్పిటల్ చైర్మన్, శ్వాస ఫౌండేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ విష్ణున్‌రావు వీరపనేని వైద్య సేవల్లో 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రచించిన ‘శ్వాస ఫ్రీడమ్ టు బ్రీత్’ పుస్తకం హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్‌ఎన్‌సీసీ)లో ఘనంగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ప్రజల్లో ఆరో గ్య చైతన్యం పెంపొందించేందుకు, చికిత్సకే పరిమితం కాకుండా నివారణ వైద్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డా.విష్ణున్‌రావు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే, వ్యాధి రాకుండా నివారించడం గొప్ప వైద్యం అని ఆయన అన్నారు.

పద్మభూషణ్ అవార్డు గ్రహీత, శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపకులు డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డి, భాగ వత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎల్‌వీ గంగాధర శాస్త్రి, ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్షులు కేఎస్ రామారావు, ఐపీఎస్ అధికారి చి. శిరీష రాఘవేంద్ర తదితరులు ప్రసంగించగా ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మా శర్మ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు, విద్యావేత్తలు, సామాజిక సేవకులు,  స్వచ్ఛం ద సంస్థల ప్రతినిధులు,  ప్రముఖులు పాల్గొన్నారు. డాక్టర్ వైష్ణవి వీరపనేని అతిథులను ఆహ్వానించగా, డాక్టర్ వివేక్ వర్ధన్ వీరపనేని వందన సమర్పణ చేశారు.