నేడు అత్తాపూర్‌లో జగన్నాథ రథయాత్ర
- ఇస్కాన్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం
- సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు ఎస్‌ఎన్‌సీ కన్వెన్షన్‌లో కీర్తలు, భజనలు
హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): అత్తాపూర్‌లోని ఇస్కాన్ 5వ వార్షిక శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. భక్తిభావంతో కూడిన ఈ గొప్ప ఉత్సవంలో పరమాత్మ ఆలయం నుంచి బయటకు వచ్చి భక్తులకు దర్శనమిస్తారని, భక్తులు భజనలు, నృత్యాలు చేస్తూ, మహాప్రసాదాన్ని పంచుతూ ఈ పండుగ చేసుకుం టారని వివరించారు. అత్తాపూర్ ఇస్కాన్ వద్ద మధ్యాహ్నం 12 గంటలకు పవిత్ర నా మస్మరణతో రథయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు.
భక్తులు రథాన్ని లాగుతూ అత్తాపూర్ పిల్లర్ నంబర్ 268 వద్ద ఉన్న ఎస్‌ఎన్‌సీ కన్వెన్షన్ వరకు ఊరేగింపుగా వెళ్తారని, సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గం టల వరకు ఎస్‌ఎన్‌సీ కన్వెన్షన్‌లో కీర్తనలు, భజనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, రామాయణ ఇతివృత్తంతో కూడిన తోలుబొమ్మ లాట, స్వామివారి సుందర దర్శనం, మహా హారతి, అందరికీ మహాప్రసాద వితరణ వం టి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
ప్రతి ఒక్కరూ ఈ దివ్యమైన ఉత్సవం లో పాల్గొని శ్రీ జగన్నాథుని రథాన్ని లాగాలని యాజమాన్యం కోరింది. రథంపై ఉన్న స్వామివారిని దర్శించుకున్నవారు జనన మరణ చక్రం నుంచి విముక్తి పొంది వైకుంఠాన్ని చేరుకుంటారని మన పురాతన గ్రంథాలు చెప్తున్నాయని తెలిపారు.






