18 July, 2026 | 1:22 AM

నీట్ ఫలితాల్లో ‘రేసోమెడికాన్’ హవా

18-07-2026 01:22 AM

మరోసారి అగ్రగామిగా నిలిచిన కళాశాల

హనుమకొండ, జులై 17 (విజయక్రాంతి): ఎన్టీఏ తాజాగా విడుదల చేసిన నీట్ 2026 ఫలితాల్లో హనుమకొండలోని రేసో మెడికాన్ జూనియర్ కళాశాల విద్యార్థులు మరో సారి అద్భుతమైన ప్రతిభను కనబరిచారని సంస్థ చైర్మన్ లెక్కల రాజిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా నీట్-2026 పరీక్షకు హాజరైన రేసో మెడికాన్ విద్యార్థుల్లో అత్యధిక శాతం మంది ఫ్రీ మెడికల్ సీట్లు సాధించే స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించారని, పలువురు విద్యార్థులు ప్రతిష్టాత్మక ప్రభుత్వ, ప్రముఖ మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలు పొందనున్నారని రాజిరెడ్డి తెలిపారు.

కె. శ్యాం కరన్ (హాల్ టికెట్ నెం. 260410321709)655 మార్కులు, పి. గురురాజ్‌రెడ్డి (హాల్ టికెట్ నెం. -260410427973)630మార్కులు, బి. కోమల్(హల్ టికెట్ నెం. 260410487 173) 591 మార్కులు, బి.అభిషేక్(హాల్ టికెట్ నెం. 260410168368) 580 మార్కులు, సీహెచ్ సాక్షి(హాల్ టికెట్ నెం. 260410877926) 546 మార్కులు, మహమ్మద్ అద్నాన్ (హాల్ టికెట్ నెం. 2604 10439933) 528 మార్కులు, ఎన్.మణిదీప్(హాల్ టికెట్ నెం. 26041007161 4)528 మార్కులు, వేముల జస్విన్ ప్రీత్(హాల్ టికెట్ నెం. 260410399249) 500 మార్కులు సాధించారన్నారు.

రేసోమెడికాన్ మేనేజింగ్ డైరెక్టర్ దీప్తిరావు మాట్లాడుతూ, ఇంకా 56 మంది విద్యార్థులు 400కు పైగా మార్కులు సాధించి, ఫ్రీ మెడికల్ సీట్లు పొం దే అవకాశాలను మెరుగుపరుచుకున్నారని తెలిపారు.  కార్యక్రమం లో రేసోనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ దీప్తిరావు, ఇతర డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, సీఈవో లెక్కల రమ్యారాజిరెడ్డి, ప్రిన్సిపల్, ఫ్యాకల్టీ, ర్యాంకులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు తదతరులు పాల్గొన్నారు.