03-09-2025 11:26:28 PM
వరంగల్ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వీసం సురేందర్ రెడ్డి
వడ్డేపల్లి,(విజయక్రాంతి): బుధవారం వీసం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు అవినీతి చేసి వచ్చిన డబ్బులను తండ్రి కెసిఆర్, బిడ్డ కవిత, అన్న కేటీఆర్, బావ హరీష్ రావు, సంతోష్ కుమార్ లు దోపిడీ చేసి ఇప్పుడు పంపకాల్లో విభేదాలు వచ్చి బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జైలుకు వెళ్దామని భయంతో రాష్ట్ర ప్రజల మీడియా దృష్టిని మళ్లించడానికి కేసీఆర్, కవిత కలిసి కొత్త డ్రామా ఆడుతున్నారు.
బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎప్పుడో శాశ్వతంగా సస్పెండ్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో వారు దోచుకున్న దొంగతనం గురించి ఒకరి మీద ఒకరు బహిరంగ విమర్శలు చేసుకోవడం త్వరలోనే మనం చూస్తాం. త్వరలో కెసిఆర్ కుటుంబం మొత్తం జైలుకు వెళ్లడం జరుగుతుంది. కవిత వాక్యాలు కేంద్ర ప్రభుత్వం, సిబిఐ సుమోటగా స్వీకరించి వారిని జైలుకి పంపవలసిందిగా అని అన్నారు.