04-09-2025 12:00:00 AM
మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి
చేవెళ్ల, సెప్టెంబర్ 3 : కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో నమ్మకం పోయందని, రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చాటాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి సూచించారు. బుధవారం చేవెళ్ల మండల పరిధి ముడి మ్యాల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శేరి స్వర్ణలతాదర్శన్, కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాజీ మంత్రి సబితారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి సబితారెడ్డి బీఆర్‌ఎస్లోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితారెడ్డి మాట్లా డుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నదని, 420, 6 గ్యారెంటీల్లో ఏ ఒక్కటీ సక్రమంగా అమలు చేయడం లేదని మండిపడ్డారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధిని చూసి రేవంత్ సర్కార్ బుద్ధి తెచ్చుకొని ప్రజల హామీలను నెరవేర్చాలన్నారు. గొప్పలు చెప్పుకోవడంలో కాంగ్రెస్ను మించినది ఏది లేదని, కాంగ్రెస్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి బీఆర్‌ఎస్ పార్టీనే రక్ష అని, మళ్లీ ప్రజలు బీఆర్‌ఎస్, మాజీ సీఎం కేసీఆర్ పరిపాలన రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చూపించి భారీ మెజార్టీలో గెలువాలని, అందుకు నాయకులు, కార్యకర్తలు అంకిత భావంతో పని చేస్తూ బీఆర్‌ఎస్ గెలుపుకోసం పనిచేయాలన్నారు. బీఆర్‌ఎస్లో చేరిన వారిలో శేరి శ్రీనివాస్, కావలి శ్రీశైలం, ఊరడి వెంకటేష్, జుకంటి గోపమ్మ, యంజాల రవి, గౌండ్ల శ్రీను, కావలి భీమయ్య, యంజాల శంకరయ్య, ఊరడి యాదయ్య, కావలి కృష్ణ, బండ్లకాడి శ్రీనివాస్, ఎర్రవల్లి ప్రవీణ్, మహేష్, జొన్నాడ సామయ్య, యంజాల సుధాకర్, ఎండీ ఆఫిజ్, అని ల్, బ్యాగరి ప్రవీణ్, యంజాల కుమార్, గుండాల వెంకట య్య,అంతారం నర్సింలు, మహిళలు ఉన్నారు.
కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్లొళ్ల కృష్ణారెడ్డి, నియోజకవర్గ బీఆర్‌ఎస్ యూత్ అధ్యక్షుడు గోనె కరుణాకర్రెడ్డి, సీనియర్ నాయకులు గోనె కరుణాకర్రెడ్డి, శేరి రాజు, మాజీ ఉప సర్పంచ్ ఎండీ ఆరి ఫ్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు గోనె మాధవరెడ్డి, గోనె మో హన్ రెడ్డి, ఎండీ మహ్మద్, బ్యాగరి శివకుమార్, బ్యాగరి తేజ, గోనె రాఘవేందర్ రెడ్డి, సంకెపల్లి సతీష్, సంకెపల్లి కృష్ణ, జు కంటి కృష్ణ, సూర్యాపేట మహేందర్, కావలి రమేష్, కుమ్మరి శ్రీకాంత్, ఎర్రవల్లి జంగయ్య, ఊరడి సురేష్, కమ్మరి మహేష్, బ్యాగరి నందు, యంజాల బాలరాజ్ పాల్గొన్నారు.