17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

కన్నతల్లి జాడ కోసం పెంపుడు తల్లిదండ్రుల అన్వేషణ

02-02-2026 12:00 AM

గిరిజన గ్రామాల్లో డెన్మార్క్ దంపతులు పర్యటన

ఉట్నూర్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): దత్తత తీసుకున్న కొడుకు అర్జున్ అలియాస్ డానీష్ కు జన్మనిచ్చిన తల్లి కోసం దత్తత తీసుకున్న డెన్మార్క్‌కు చెందిన దంపతులు అదిలాబాద్ జిల్లాకు వచ్చి బాబుకు జన్మనిచ్చిన తల్లి కోసం గిరిజన గ్రామాల్లో అన్వేషి స్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. 2016లో జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో చేతికి సగం వేళ్ళు ఉన్నాయని కన్నవారు బాలున్ని వదిలేసి వెళ్తే, భారతదేశ చట్టం ప్రకారంగా ఆ బాబుని తాము దత్తత తీసుకొని పెంచుకుంటున్నామని డెన్మార్క్ దేశం నుంచి వచ్చిన దంపతులు లూయిస్, రాస్మస్ తెలిపారు.

ప్రస్తుతం 9 ఏళ్ల ఈ బాబు చేతి వేళ్ళ ను చూసి కన్నతల్లి గుర్తిస్తే ఆ మాతృమూర్తికి తమ వంతు ఆర్థిక సాయం చేస్తామని, ఆ కుటుంబంతో ఎల్లప్పుడూ బంధుత్వం కొనసాగిస్తామని చెప్పారు. ఆదివారం ఇంద్రవెల్లి మండలంలోని చిల్లటి గూడ, టేకిడి గూడా, నార్నూర్ మండలంలోని చోర్ గావ్, సుంగాపూర్ తదితర గిరిజన గ్రామాల్లో పర్యటిం చారు. వారి వెంట ఢిల్లీ న్యాయవాది అంజలి పవార్, సిడబ్ల్యుసి మాజీ చైర్మన్  యాకూబ్ బేగ్, సర్పంచులు పేందూరు లక్ష్మణ్, కుమ్రా ధర్ము, గిరిజనులు పాల్గొన్నారు.